Home సినిమా వార్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ కొత్త లుక్

సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ కొత్త లుక్

సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ఈరోజు అధికారికంగా ప్రకటించబడింది. ఈరోజు విడుదలైన ఈ మినీ టీజర్ కు నిరాశపరిచే విధంగా స్పందన వచ్చింది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ రివీల్ చేయబడింది. కాగా ఈ సినిమాలో సల్మాన్‌ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు.

ఉంగరాల జుట్టు, చెవిపోగులు, సన్ గ్లాసెస్‌తో పాటు చైన్‌తో కనిపిస్తున్నారు. అయితే సల్మాన్‌ కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది కానీ.. అందుకు ఫలితం మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. దాంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ లక్ష్యం నెరవేరలేదు.

ఆ రకంగా చూసుకుంటే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫస్ట్ లుక్ తో చాలా మంది సల్మాన్ అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. అయితే ఈ నెగటివ్ రెస్పాన్స్ లో స్పష్టమైన ఫిర్యాదు ఏమిటంటే.. సల్మాన్ హైర్ స్టైల్ చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే ఆయన వేషధారణ కూడా చాలా మామూలుగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా ఈ విడియో చూస్తే.. సల్మాన్ లుక్‌ని రూపొందించడంలో చిత్ర బృందం పెద్దగా కసరత్తు చేయలేదని అర్థం అవుతుంది. మాస్ అప్పీల్ ను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ అనౌన్స్మెంట్ వీడియోను వదిలినప్పటికీ.. ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందన మాత్రం పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.

మొత్తంగా హైప్ ను బాగా పెంచుతుంది అని భావించిన ఈ ఫస్ట్ లుక్ ను సల్మాన్ అభిమానులు చాలా వరకూ ఇష్టపడలేదు. ఇక ఇతర హీరోల అభిమానులు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో సల్మాన్ లుక్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో షెహనాజ్ గిల్, జాస్సీ గిల్ మరియు సిద్ధార్థ నిగమ్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫర్హాద్ సంజీ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సల్మాన్ ఖాన్ హీరో అవటంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Follow on Google News Follow on Whatsapp

We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.



Exit mobile version