సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ఈరోజు అధికారికంగా ప్రకటించబడింది. ఈరోజు విడుదలైన ఈ మినీ టీజర్ కు నిరాశపరిచే విధంగా స్పందన వచ్చింది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ రివీల్ చేయబడింది. కాగా ఈ సినిమాలో సల్మాన్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు.
ఉంగరాల జుట్టు, చెవిపోగులు, సన్ గ్లాసెస్‌తో పాటు చైన్‌తో కనిపిస్తున్నారు. అయితే సల్మాన్ కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది కానీ.. అందుకు ఫలితం మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. దాంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ లక్ష్యం నెరవేరలేదు.
ఆ రకంగా చూసుకుంటే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫస్ట్ లుక్ తో చాలా మంది సల్మాన్ అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. అయితే ఈ నెగటివ్ రెస్పాన్స్ లో స్పష్టమైన ఫిర్యాదు ఏమిటంటే.. సల్మాన్ హైర్ స్టైల్ చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే ఆయన వేషధారణ కూడా చాలా మామూలుగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా ఈ విడియో చూస్తే.. సల్మాన్ లుక్‌ని రూపొందించడంలో చిత్ర బృందం పెద్దగా కసరత్తు చేయలేదని అర్థం అవుతుంది. మాస్ అప్పీల్ ను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ అనౌన్స్మెంట్ వీడియోను వదిలినప్పటికీ.. ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందన మాత్రం పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.
మొత్తంగా హైప్ ను బాగా పెంచుతుంది అని భావించిన ఈ ఫస్ట్ లుక్ ను సల్మాన్ అభిమానులు చాలా వరకూ ఇష్టపడలేదు. ఇక ఇతర హీరోల అభిమానులు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో సల్మాన్ లుక్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో షెహనాజ్ గిల్, జాస్సీ గిల్ మరియు సిద్ధార్థ నిగమ్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫర్హాద్ సంజీ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సల్మాన్ ఖాన్ హీరో అవటంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు.
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at [email protected]. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.