బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ఈ శుక్రవారం విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి తీవ్రమైన విమర్శలతో కూడిన స్పందనను తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు చాలా సాధారణమైన పనితీరు కనబర్చిన ఈ సినిమా రెండో రోజు మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించి సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ ను మరోసారి రుజువు చేసింది. శనివారం ఈ చిత్రం రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు బాలీవుడ్ ట్రేడ్ పండితులు తెలియజేశారు.
ఎన్నో ట్రోల్స్ వచ్చిన ఈ తరహా సినిమాను మరింత పేలవమైన టాక్ కు తోడు ఇంత బలహీనమైన బజ్ ఉన్న సినిమాని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టడం అంత తేలికైన పని కాదు, ఈ సినిమా యొక్క బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ తో సల్మాన్ ఖాన్ తన సూపర్ స్టార్ డమ్ ను మరోసారి నిరూపించుకున్నారని చెప్పవచ్చు. ఈ రోజు కూడా ఈ సినిమా నిన్నటి స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో వెంకటేష్, షెహనాజ్ గిల్, రాఘవ్, సిద్ధార్థ్ నిగమ్, భూమిక చావ్లా, జాస్సీ గిల్, పాలక్ తివారీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే.. భాయిజాన్ (సల్మాన్ ఖాన్) తన ప్రియమైన సోదరులు మోహ్ (జాస్సీ గిల్), లవ్ (సిద్ధార్థ్ నిగమ్), ఇష్క్ (రాఘవ్ జుయాల్) నుండి ఒక అమ్మాయి తనను విడదీయడం ఇష్టం లేని కారణంగా వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. హైదరాబాదీ అయిన భాగ్య లక్ష్మి గుండమనేని (పూజా హెగ్డే) భాయిజాన్ ఇంట్లో అద్దెకు వచ్చి పెళ్లి పట్ల తన దృక్పథాన్ని మార్చుతుంది. అంతా బాగానే సాగుతున్నప్పుడు, ఒక గూండాల గుంపు భాగ్యపై దాడి చేస్తారు, మరియు భాయిజాన్ ఆ తరువాత భాగ్యను చంపడానికి ప్రయత్నించడానికి గూండాలను పంపిన ప్రధాన వ్యక్తి ఎవరో కనుగొని , భాగ్య మరియు ఆమె అన్నయ్య (వెంకటేష్) ను కాపాడే బాధ్యత తీసుకుంటాడు.