Homeసినిమా వార్తలుSalaar hindi version Trending top on OTT for a Year ఏడాదిగా ​ఓటిటి లో...

Salaar hindi version Trending top on OTT for a Year ఏడాదిగా ​ఓటిటి లో టాప్ లో దూసుకెళ్తున్న ‘సలార్’ హిందీ వర్షన్

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ పార్ట్ 1. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, ఝాన్సీ, శ్రేయ రెడ్డి, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఏడాదిన్నర క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీ రిలీజ్ అనంతరం నటుడిగా ప్రభాస్ రేంజ్, మార్కెట్ వేల్యూ కూడా మరింతగా పెరిగాయి. అంతకుముందు కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో భారీ విషయాలు అందుకున్న ప్రశాంత్ నీల్ దీనితో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

ఇక విషయం ఏమిటంటే ఏడాది క్రితం సలార్ మూవీ ఓటీటీ లోకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ఓటిటి ప్రత్యేకంగా హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. అయితే ఏడాదిగా జియో హాట్ స్టార్ లో సలార్ హిందీ వర్షన్ టాప్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. 

READ  '​స్పిరిట్' లో విష్ణు కి అవకాశం దక్కేనా ?

ముఖ్యంగా సలార్ సినిమాలోని మాస్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు నార్త్ ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని అందుకే ఏడాది గడిచినప్పటికీ కూడా ఇంకా హాట్ స్టార్ లో ఈ మూవీ టాప్ లోనే కొనసాగుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అయిన సలార్ 2 శౌర్యంగ పర్వం వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

Follow on Google News Follow on Whatsapp

READ  Hari Hara Veera Mallu Second Song Release Date Time Fix '​హరి హర వీర మల్లు' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories