పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి ఐదు రోజుల క్రితం మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది.
ఇక దీని అనంతరం మరికొన్ని ప్రాజక్ట్స్ ని ప్రభాస్ ఇప్పటికే లైన్ లో పెట్టారు. ఇక మరోవైపు యువ దర్శకుడు మారుతీ తో ది రాజా సాబ్ మూవీ చేస్తున్న ప్రభాస్, ఆపైన సలార్ 2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, అలానే హను రాఘవపూడి మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విషయం ఏమిటంటే, వీటిలో సలార్ 2 రానున్న ఆగష్టు నుండి పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 శాతం మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షెడ్యూల్ ని ఆగష్టు లో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభించనున్నారట.
అక్కడి నుండి వేగంగా పూర్తి చేసేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. హోంబలె ఫిలిమ్స్ సంస్థ సలార్ 2 ని మరింత గ్రాండియర్ గా మరియు భారీ వ్యయంతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక సలార్ 2 ని 2025 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.