Homeసినిమా వార్తలుజూలై 15న విడుదల కానున్న సాయి పల్లవి కొత్త సినిమా "గార్గి"

జూలై 15న విడుదల కానున్న సాయి పల్లవి కొత్త సినిమా “గార్గి”

- Advertisement -

న‌ట‌నకు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ద‌క్షిణాదిన ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న న‌టి సాయి ప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం ఈమెకు స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. గ్లామ‌ర్‌కు అతీతంగా మంచి పాత్ర‌లు పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌రయ్యారు.ఇటీవ‌లే ‘విరాట‌ప‌ర్వం’తో మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చవి చూసినా సాయి పల్లవి నటనకు గాను ప్రశంసలు అందుకున్నారు.

ఇదిలా ఉండగా సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం ‘గార్గి’.త్రిభాషా చిత్రంగా(తెలుగు, తమిళం, కన్నడ) చిత్రంగా రూపొందిన ఈ చిత్రం గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఇటీవలే సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన లభించింది.ఈ సినిమాని త‌మిళంలో 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుద‌ల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ’96’ ఫేం గోవింద్ వ‌సంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ర‌విచంద్ర‌న్,ఐశ్వర్య లక్ష్మీ,థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

READ  ఏనుగునే భయపెట్టిన విక్రమ్

తాజాగా గార్గి సినిమాకు సంభందించిన కొత్త అప్డేట్ వచ్చింది. జూలై 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు స్వయంగా సాయి పల్లవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వరుస సినిమాలతో,చక్కని పాత్రలతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సాయి పల్లవి..”గార్గి” ద్వారా మరో విజయం సాధించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  పక్కా కమర్షియల్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories