గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఎట్టకేలకు ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనుంది. మార్చి 23న పూజా కార్యక్రమాలు జరుపుకుని, మార్చి 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ వార్త విని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొదట 2022 వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు, అక్కడి నుండి వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి 2024 ఏప్రిల్ లో విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు కొరటాల శివ అండ్ కో ఎట్టకేలకు మార్చిలో టైమ్ ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమాకి తెలుగుతో పాటు హిందీలో కూడా బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. తెలుగులో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీ సర్కిల్స్ లో కూడా అంతే స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు ఇటీవలే మొదట జాహ్నవి కపూర్ ను హీరోయిన్లా తీసుకున్నారు. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ లో ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది విడుదలైన ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియో విడుదలయినప్పటి నుండే ఎన్టీఆర్ 30 అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు.