సాయి పల్లవి క్రేజ్ రోజకీ పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ హీరోలతో సమానంగా ఉంది అంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదనే చెప్పాలి.
మొదటి నుంచీ సాయి పల్లవి స్థాయి కాస్త భిన్నమనే చెప్పాలి. అందుకే అభిమానుల్లో అవిడకు అంత ఆదరణ లభించింది. సాధారణంగా హీరోయిన్ అంటే ఉండాల్సిన క్యాలిక్యులేశన్స్ అన్నిటినీ తుడిపేసింది సాయి పల్లవి.
టాప్ హీరోయిన్స్ సైతం పబ్లిక్ ఫంక్షన్ లకు మంచి గ్లామర్ విందు అందించి తమ స్థానం పదిలం చేసుకోవాలి అని చూస్తుంటే సాయి పల్లవి మాత్రం ఎక్కడైనా ఎప్పుడైనా హుందాగా నడుచుకుంటుంది. ఇక స్క్రీన్ మీద తనదైన నటన, చిరునవ్వు మరియు అద్భుతమయిన డాన్స్ తో తనకు తానే సాటి అనిపించుకుంటుంది.
సాయి పల్లవి తదుపరి చిత్రం విరాట పర్వం ట్రైలర్ వేడుకలో వర్షం కాస్త ఆటంకం కలిగించింది.ఆ సమయంలో సాయి పల్లవి మాట్లాడే సమయంలో హీరో రానా ఆమెకు గొడుగు పట్టడం ఆ ఫంక్షన్ కే హైలైట్ గా నిలిచింది.
ఇంతకు ముందు శ్యామ్ సింఘా రాయ్, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాల ఫంక్షన్ లోనూ సాయి పల్లవి కి లభించిన క్రేజ్ ను చూసి ఇతర హీరోయిన్లు, అతిథులు ఆశ్చర్యపోయారు.