సాయి పల్లవి…ఈ తరం కథానాయికల్లో చాలా ప్రత్యేకమైన ఇమేజ్, స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అమ్మాయి. సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నాయి. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వేడుకలో దర్శకుడు సుకుమార్ ఆమెను ‘లేడీ పవర్ స్టార్’ అని పేర్కొనడం ఆ ఫంక్షన్ కే హైలైట్ గా నిలించింది.
ఇక ‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏకంగా సాయి పల్లవికి చెందిన ఏవీ లోనే లేడీ పవర్స్టార్ అనే టాగ్ వేయడం జరిగింది.ఈ కొత్త టాగ్ వ్యవహారం మీద సాయి పల్లవి స్పందించారు. అలాంటి టాగ్ లు తనకి వద్దని, అలా పిలవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని,అలాంటి వాటి వల్ల తన మీద అదనపు భారం పడుతుందని సాయి పల్లవి అభిప్రాయం. ప్రేక్షకులు చూపించే అభిమానం,ప్రేమని మాత్రమే స్వీకరించాలని, అందుకని పాత్రల ఎంపిక విషయంలో జాగర్తగా ఉంటానని,ఇతరత్రా టాగ్ లు వంటివి పట్టించుకుంటే తన పై ఒత్తిడి పెరుగుతుంది అని ఆవిడ చెప్పడం జరిగింది.
ఇదిలా ఉండగా ఇదివరకు సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాగా ఆవిడ తిరస్కరించింది. ఇదే విషయం పై మాట్లాడుతూ, ఒక తమిళ సినిమా రీమేక్ ఆఫర్ తన దగ్గరకి వచ్చిందని, రీమేక్ లు అంటే స్వతహాగా భయం అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ఒకరు చేసిన పాత్రను తాను చేయాలి అంటే ఆ ఒత్తిడి తట్టుకోలేనని, అందుకే ఆ పాత్ర చేయలేదని చెప్పారు. అయితే చిరంజీవి గారి లాంటి యాక్టర్ తో సినిమా ఛాన్స్ రావడం నిజంగా అదృష్టం అని ఆ సినిమా చేయలేక పోయినందుకు తాను చాలా బాధ పడ్డానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ఎంతో పెద్ద మనసుతో తను ఆఫర్ ను వద్దన్నా స్పోర్టివ్ గా తీసుకున్నారు అని భవిష్యత్తులో అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనతో సినిమా చేస్తానని సాయి పల్లవి చెప్పారు.సాయి పల్లవి కోరిక త్వరలోనే తీరాలి అని కోరుకుందాం.