ప్రస్తుతం కోలీవుడ్లో యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్ పేరు మారుమ్రోగుతోంది. గాయకులు టిప్పు, హరిణిల కుమారుడైన సాయి, కెరీర్ పరంగా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోస్ కంపోజ్ చేసి వారితో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అతడు వరుసగా అవకాశాలతో కొనసాగుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్, అట్లీ కలిసి పని చేయనున్న గ్రాండ్ విజువల్ వండర్ మూవీకి ఆయనే సంగీత దర్శకత్వం వహించనున్నారు.
అఫీషియల్ గా ప్రకటన చేయనప్పటికీ అభ్యంకర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవాన్ని ఈ సినిమాకి మొదట అనిరుద్ ని తీసుకుందాం అని భావించినప్పటికీ ఆయన ఫుల్ గా బిజీగా ఉండటంతో ఆయన స్థానంలోకి సాయి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అతడి ఖాతాలో మరికొన్ని సినిమాలు కూడా ప్రస్తుతం చేరాయి. అవి సూర్యా 45వ మూవీ, దీనిని ఆర్జే బాలాజీ తెరకెక్కించుకున్నారు. అలానే ప్రదీప్ రంగనాథన్ తదుపరి కెరీర్ నాలుగో సినిమా కూడా చేయనున్నారు సాయి అభ్యంకర్.
వీటితోపాటు రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతోన్న బెంజితో పాటు శింబు త్వరలో నటించనున్న సినిమా కూడా సాయినే మ్యూజిక్ అందించనున్నారు. మొత్తంగా ఈ విధంగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న సాయి అభ్యంకర్, ఈ సినిమాలతో ఏ స్థాయిలో విజయాలు, పేరు అందుకుంటారో చూడాలి. కాగా ఇప్పటివరకు కేవలం మ్యూజికల్ ఆల్బమ్స్ తో అందరినీ ఆకట్టుకున్న సాయి ఒక్కసారిగా ఇన్ని వరుస క్రేజీ ఆఫర్స్ అందుకోవడం నిజంగా పెద్ద విశేషం అంటున్నాయి సినిమా వర్గాలు.