Home సినిమా వార్తలు SV Rangarao: బాలకృష్ణకు మద్దతు పలికిన ఎస్.వి.రంగారావుగారి మనవళ్లు

SV Rangarao: బాలకృష్ణకు మద్దతు పలికిన ఎస్.వి.రంగారావుగారి మనవళ్లు

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలపై మీడియాలో, సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. అయితే చివరకు ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు ఆయనకు అండగా నిలవడంతో ఆయనకు కాస్త సానుకూల వాతావరణం ఏర్పడింది.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు ఆ రంగారావు (ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ), అక్కినేని, తొక్కినేని, మరికొందరు సమకాలీకులు ఉండేవారని చెప్పారు.

ఈ వ్యాఖ్యలతో కోపగించుకున్న అక్కినేని అభిమానులు బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా అక్కినేని అభిమానులు తమతో పాటు ఎస్వీ రంగారావు కుటుంబాన్ని కూడా అవమానించడంతో వారిని కూడా తమతో కలవమని అడగడంతో వారు ఈ విషయమై అధికారికంగా స్పందించారు.

“నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం” అంటూ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version