కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిష్టాత్మక యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ జైలర్. రిలీజ్ అనంతరం భారీగా విజయవంతం అయిన ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ అనౌన్స్ చేశారు.
జైలర్ 2 మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ ఇటీవల రిలీజ్ చేయగా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. రానున్న సమ్మర్ లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే రెడీ అయ్యారు దర్శకుడు నెల్సన్ మరియు హీరో రజినీకాంత్. అయితే లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్నారని అంటున్నారు. నిజానికి జైలర్ పార్ట్ 1 మూవీలో వినాయకన్ మెయిన్ విలన్ గా కనిపించగా ఇందులో సూర్య మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.
ఇక ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ వంటివన్నీ కూడా పార్ట్ వన్ మించేలా మరింతగా అదిరిపోతాయని చెప్తున్నారు. మరోవైపు ఈ మూవీలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక చిన్న స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించవున్నారని టాక్. త్వరలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు.