Home సినిమా వార్తలు Pawan Kalyan: సుజీత్-పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై రూమర్స్… పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్

Pawan Kalyan: సుజీత్-పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై రూమర్స్… పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్

యువ దర్శకుడు సుజీత్ తో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం అనౌన్స్ మెంట్ తోనే దాని పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది భారీ సినిమా అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ రూమర్ వారికి షాక్ ఇచ్చింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 40-50 నిమిషాల పాటు మాత్రమే ఉంటారని, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. కాగా ఈ సినిమా ఇటీవల వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ తరహాలో ఉంటుందని కూడా అంటున్నారు.

ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాలో పాటలు, ఫైట్లు ఉండవని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్ల పై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ ఇవి ఉట్టి గాలి వార్తలు అని ఖండించారు.

తాత్కాలికంగా ఓజీ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమాకు సహజంగానే చాలా పైట్లకు స్కోప్ ఉంటుందని అంటున్నారు. సినిమాలో పాటలు లేకపోయినా వారికి ఒకే కానీ ఫైట్స్ లేవనే వార్తలను మాత్రం వారు వ్యతిరేకిస్తున్నారు.

ఈ ఊహాగానాలు ఉదయం నుండి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, సినిమాకి సంబందించిన ఇలాంటి పుకార్లు మరిన్ని వస్తాయని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా ఆందోళన చెందడం లేదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version