ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా క్రెడిట్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఎడతెగని యుద్ధం జరుగుతోంది. తమ అభిమాన హీరో మాత్రమే మెయిన్ లీడ్ అని, మరో హీరో సపోర్టింగ్ హీరో అని రెండు ఫ్యాన్ బేస్ లు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.
ఆర్ ఆర్ ఆర్ మొదటి ఆట నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఆస్కార్ నామినేషన్ల వరకు ఈ వాదన కొనసాగింది. ఫ్యాన్స్ పీఆర్ ప్రతి ఒక్కరూ ఈ ఫ్యాన్ వార్ లో పాల్గొన్నారు. కానీ అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే ఈ సినిమాలో రాజమౌళి అసలు హీరో అని.. ఆయనే ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరి మన్ననలు, ఫేమ్ అందుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మరోసారి ఫ్యాన్ వార్ జరగబోతోంది. అయితే ఇది ఒక చిత్రం కోసం కాదు, రెండు వ్యక్తిగత చిత్రాల మధ్య జరగబోతుంది.
ఎన్టీఆర్ 30 సినిమాకు 2024 ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 2024 సంక్రాంతికి విడుదల చేయాల్సిన ఆర్సీ15 ఇప్పుడు వేసవికి మారింది. ఆర్సీ 15 సమ్మర్ కు వాయిదా పడటంతో ఇప్పటికే 2024 సమ్మర్ కు ప్రకటించిన ఎన్టీఆర్ 30తో ఈ సినిమా పోటీ పడక తప్పదు.
అభిమానులు కూడా ఈ పోటీ ద్వారా తమ హీరో అవతలి హీరో కంటే పెద్ద స్టార్ అని నిరూపించాలని కోరుకుంటున్నారు. పైన చెప్పినట్లుగానే ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజు నుంచి ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. 2024 సమ్మర్లో జరిగే ఈ పోటీ లో గెలిచేందుకు ఇరు వర్గాలూ తీవ్రంగా ప్రయత్నిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.