Homeసినిమా వార్తలుఓటిటిలో సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్

ఓటిటిలో సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. థియేటర్లలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులు సృష్టించి ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఓ బెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది.బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో కూడా తొలి రోజు నుంచే రికార్డుల వేట ప్రారంభించిన ఈ సినిమా నేటికీ అదే హవా నడుస్తుండటం విశేషం.

ఈ చిత్రంలోని భారీ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.విడుదలైన అన్ని ఏరియాల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న నిర్మాతలకు లాభాల పంట పండించిన ఈ సినిమా ఓటీటీ వేదికలపై కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ డిజిటల్ స్ట్రీమింగ్‌లో కూడా సత్తా చాటుతోంది. దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా.హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసుకుంది.మే 20న హిందీ వర్షన్ ఆర్ ఆర్ ఆర్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది.

అప్పటినుంచి ఇటు భారతీయ ప్రేక్షకుల నుంచి అంతర్జాతీయ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రోజు రోజుకీ ఆ ఆదరణ అలా పెరుగుతూ పోతుంది.ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 45 మిలియన్ గంటలకు పైగా వ్యూస్ రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.అంతే కాకుండా ఆ నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు ఎక్కువ మంది వీక్షించిన భారతీయ సినిమాగా నిలిచింది.

READ  హరిహర వీరమల్లు ఆగిపోయిందా?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories