రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సెన్సేషనల్ మూవీగా నిలవడమే కాకుండా విమర్శకుల నుండి విశేష స్థాయిలో ప్రశంసలు కూడా అందుకుంది.
ఆస్కార్ నామినేషన్ల చుట్టూ హంగామా మరియు క్రేజ్ తో RRR తాజా పతాక శీర్షికలలో నిలిచింది. ఈ సినిమా నామినేట్ అవుతుందా లేదా, ఒకవేళ నామినేట్ అయితే ఆస్కార్ అవార్డు తెస్తుందా లేదా అనే చర్చలన్నీ సినీ అభిమానుల్లో జరుగుతున్నాయి.
ఇక ఈ నేపథ్యంలో.. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి RRR చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారని తెలిపారు. ఇంతకు ముందు సీక్వెల్ ను రూపొందించడానికి ఆసక్తి చూపలేదని, కానీ తాజాగా RRR సీక్వెల్ యొక్క స్క్రిప్ట్ పై పనిచేశానని రాజమౌళి చెప్పారు.ఫిల్మ్ మేకర్ అడ్డా 2022 లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.
RRR సీక్వెల్ జరుగుతోంది, ప్రారంభంలో మేము పార్ట్ 2 ఆలోచనతో లేము, కానీ మాకు కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి అవి అంత గొప్పవి అనిపించలేదు కాబట్టి మేము వాటిని వదిలివేశాము, తరువాత కొన్ని వారాల క్రితం ఒక గొప్ప ఆలోచన తట్టడంతో మేము దీన్ని తయారు చేయాలని అనుకుంటున్నాము, ప్రస్తుతం మేము రచన దశలో ఉన్నాము, కాబట్టి అది పూర్తయితే తప్ప నేను దాని గురించి మాట్లాడలేనని రాజమౌళి అన్నారు.
అలాగే, ఫిల్మ్ మేకర్ అడ్డా 2022 సందర్భంగా, విజయవంతమైన చిత్రం చేయడానికి రహస్యం ఏమిటని దర్శకులను అడిగినప్పుడు, ఎస్ ఎస్ రాజమౌళి ప్రేక్షకులను అర్థం చేసుకోవడం మరియు వారితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అవసరం అని చెప్పారు.
ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రం దేశవిదేశాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా బాగా ఆడుతోంది, విదేశీ అవార్డులలో కూడా దుమ్ము దులుపుతోంది.
ఇటీవల 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట నామినేట్ అయింది. ఇక తాజాగా బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ లో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అవార్డును RRR సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గెలుచుకున్నారు.