RRR Naatu Naatu Song: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పీరియాడిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించగా, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.
ఇక ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చాక, ఈ సినిమా గ్లోబల్ ఆడియెన్స్‌కు మరింతగా చేరువైంది. ముఖ్యంగా ఇతర దేశాల ఆడియెన్స్ ఈ సినిమాను చాలా ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలోని పాటలకు కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటలో చరణ్, తారక్‌లు చేసిన ఫాస్ట్ స్టె్ప్స్ డ్యాన్స్‌కు వారు ఫిదా అయ్యారు. పలు షోలు, ఈవెంట్స్‌లలో ఈ పాటను ఇమిటేట్ చేస్తూ చాలా మంది పర్ఫార్మ్ చేశారు. అయితే ఇప్పటికే ఆస్కార్ అవార్డుల బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయ్యింది.
తాజాగా మరో ప్రెస్టీజియస్ అవార్డ్స్ బరిలోనూ ఆర్ఆర్ఆర్ చోటు సాధించింది. ‘హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్’లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఈ వార్తను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తాజాగా వెల్లడించింది. ఇక దీంతో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఖచ్చితంగా అవార్డ్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి మున్ముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.