తెలుగు సినీ దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని మరోటి కీర్తిని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక థియేటర్, ఓటీటీలో విజయ ఢంకా మోగించిన తరువాత ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటడం ఖాయం అంటూ భారతీయ సినీ వర్గాలు, ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తప్పకుండా ఈసారి ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు దక్కడం నిజంగా గౌరవమే. అయితే అందుకు అర్హత ఉన్న సినిమాగా బాలీవుడ్ పరిశ్రమ నుంచి ప్రోత్సాహం రావడమే ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఒక విజయంగా చెప్పవచ్చు.
ఇక అనురాగ్ కాశ్యప్ ఆర్ ఆర్ ఆర్ సినిమాని పోగొడుతూ.. ఆస్కార్ యందు పలు విభాగాల్లో సినిమాకు నామినేషన్స్ దక్కుతాయనే నమ్మకంను వ్యక్తం చేయడంతో పాటు 99% ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ఖచ్చితంగా ఉంటుందని పేర్కొనడం విశేషం.
ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం మాట పక్కన పడితే.. కనీసం పోటీదారుల లిస్ట్ లో ఎంపికైనా చాలు అని మన ప్రేక్షకులు మరియు సినీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్ ఆర్ ఆర్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు వల్ల ఈసారి ఆ పని కాస్త సులభంగా అవుతుందని పలువురు సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసిన హాలీవుడ్ ప్రముఖులు సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. కొందరు రామ్ చరణ్ ను జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలని ఆశ పడితే.. మరి కొందరు ఎన్టీఆర్ నటనకు గానూ ఉత్తమ నటుడి విభాగంలో చోటు దక్కాలని అభిప్రాయ పడ్డారు.
మొదట ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకోగా, అటు పైన ఇతర దక్షిణాది ప్రేక్షకులు, మరియు హిందీ ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఓటీటీలో విడుదలైన తరువాత ఏకంగా హాలీవుడ్ ప్రేక్షకులు మరియు సెలబ్రిటీల వద్ద నుంచి అత్యంత ప్రజాదరణ పొందడం వల్ల ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడం కూడా దాదాపు ఖరారు అన్నట్లుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆశావహ దృక్పథంతో ఉన్నారు.