Homeసినిమా వార్తలుఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ఆర్ ఆర్ ఆర్

ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సెషనల్​ చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’. ఈ తరం మాస్ హీరోలు ఇద్దరు కలిసి నటించడం అనే అంశం వల్ల అందరి కళ్ళూ ఈ సినిమా మీద మొదటి నుంచి ఉన్నాయి, అందులోనూ బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా అవడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఆసక్తిని పెంచింది.

కరోనా వల్ల పలు మార్లు విడుదల వాయిదా అవడం మూలాన ప్రేక్షకులు కాస్త నిరాశ పడిన మాట వాస్తవమే అయినా సినిమా థియేటర్లలోకి వచ్చాక రాజమౌళి హీరోలతో చేయించిన అద్భుత విన్యాసాలకు ఔరా అన్నారు. థియేట్రికల్ రన్ లో రికార్డుల మోత మోగించిన ఆర్ ఆర్ ఆర్, ఆ తరువాత ఓటీటీలో కొత్త రికార్డును సృష్టించింది.నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్​,భారత్​ నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా నిలిచినట్లు నెట్​ఫ్లిక్స్​ ఇటీవలే ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.థియేటర్లలో రిలీజ్​ అయిన రెండు నెలల తర్వాత అంటే మే 20 నుంచి ఆర్​ఆర్​ఆర్​ మూవీ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. కేవలం నెలరోజుల్లోనే మూడు గంటల రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు 45 మిలియన్ గంటల పాటు వీక్షించారు. ఇది అరుదైన ఘనతగా నెట్​ఫ్లిక్స్​ పేర్కొంది. అందుకే ఆర్​ఆర్​ఆర్​ సినిమా భారత్​ నుంచి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా నిలిచినట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది నెట్​ప్లిక్స్.

READ  కన్ఫ్యూజన్ లో మెగాస్టార్ చిరంజీవి

తాజాగా మరో అరుదైన రికార్డును మరియు గౌరవాన్ని దక్కించుకుంది.HCA (Hollywood critics association) అనే సంస్థ ఉత్తమ చిత్రాలకు అవార్డ్ లు ఇచ్చే కార్యక్రమంలో ఆర్ ఆర్ ఆర్ కూడా నామినేట్ అయింది.ఖచ్చితంగా ఇది ఆనందించదగ్గ విషయమే,కేవలం పోటీలో పాల్గొనడమే కాకుండా అవార్డ్ కొట్టి మరింత ఖ్యాతిని గడిస్తే ఆనందం మరింత రెట్టింపు అనడంలో ఎలాంటి సందేహం లేదు.డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్ ​పై దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

ఆర్​ఆర్​ఆర్​ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు12 వందల కోట్లు రూపాయలు కలెక్షన్స్​ రాబట్టి బిగ్గెస్ట్​ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​ సరసన హీరోయిన్లుగా ఆలియా భట్​, ఒలీవియా మోరిస్ నటించారు.

READ  Box-Office అంటే సుందరానికీ నాలుగవ రోజు కలెక్షన్ లు పెద్ద షాక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories