Homeసినిమా వార్తలుRRR in Japan: జపాన్ లో విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్

RRR in Japan: జపాన్ లో విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ నంబర్ వన్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించి భారీ కలెక్షన్లని రాబట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, భారత దేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ సినిమా విడుదల అయింది. మన తెలుగు సినిమాలకి వేరే దేశాల్లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించి పెట్టే పనిలో ఉంది ఆర్ ఆర్ ఆర్ సినిమా.

ఇది వరకే అమెరికా, ఆస్ట్రేలియా లో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కలెక్ట్ చేయనన్ని వసూళ్లు రాబట్టింది. ఈ రెండు దేశాలే కాక పలు దేశాల్లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి వసూళ్లు కొల్లగొట్టింది.ఆర్ఆర్ఆర్ సినిమాని ఇప్పుడు చైనా, జపాన్ తో సహా మరో ముప్పై దేశాల్లో త్వరలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల మన భారతీయ సినిమాలకి చైనా, జపాన్ మంచి మార్కెట్ గా మారుతుంది. గత కొన్నేళ్లలో అక్కడ విడుదలైన హిందీ సినిమాలు దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే మన తెలుగు సినిమాలైన ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలు చైనా, జపాన్ లో మంచి స్పందనే రాబట్టాయి. దీంతో ముందుగా మన దేశంలో పాటు అమెరికా తదితర దేశాల్లో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి అటు పైన చైనా, జపాన్ దేశాల్లో కూడా మన సినిమాలని విడుదల చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మొదలయింది.

READ  ది వారియర్ ట్రైలర్ : పక్కా మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్న రామ్

ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ ను ప్రపంచవ్యాప్తంగా మరో 30కి పైగా వివిధ దేశాలలో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆ క్రమంలోనే ఈ సినిమా ముందుగా అక్టోబర్‌లో (October 21) జపాన్‌లో విడుదల అవుతుందని తెలిపారు. మరోసారి విదేశాల్లో తాను, ఎన్టీఆర్ మరియు రాజమౌళి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటామని చెప్పారు. ఇక ఆ ప్రచారంలో భాగంగా పలు దేశాలు చుట్టొస్తామని ఆయన తెలిపారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఏజెంట్ టీజర్: అదరగొట్టిన అఖిల్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories