దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఆకట్టుకుని అందులోని నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ అటు ఓటిటి లో కూడా అదరగొట్టింది.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీకి సంబంధించి బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఒక డాక్యుమెంటరీని ప్రముఖ ఓటిటి మాధ్యమం ఈ డిసెంబర్ లో రిలీజ్ కానుందని టీమ్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. కాగా త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రతిష్టాత్మక SSMB 29 మూవీ తెరకెక్కించనున్నారు ఎస్ ఎస్ రాజమౌళి.