దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ఆర్ఆర్ ఈ శుక్రవారం USA లో రీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ పొంది సూపర్ స్ట్రాంగ్ గా స్టార్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. కాగా శుక్రవారం ఈ చిత్రం 50కే డాలర్లు కలెక్ట్ చేయగా, ఆస్కార్ అవార్డులకు సంబంధించి సినిమా పై ఉన్న క్రేజ్, హైప్ దృష్ట్యా వీకెండ్ కూడా అద్భుతంగా ట్రెండ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి.
అంచనాలకు తగ్గట్టుగానే ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా ట్రెండ్ అయ్యింది, వీకెండ్లో 140కే డాలర్లు వసూలు చేసింది, ఇది భారతీయ రూపాయలలో సుమారు 1.1 కోట్ల గ్రాస్, ఇది ఒక రీ-రిలీజ్ లో అద్భుతమైన నంబర్ గా చెప్పుకోవచ్చు. సోమవారం కూడా ఈ సినిమా బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా అన్ని చోట్లా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 2022 మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. హాలీవుడ్ లోనూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే పలు విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.
ఇటీవల ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులతో సహా ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఇక ఈ చిత్రం అన్ని వైపులా ప్రశంసలు మరియు ఖ్యాతిని పొంది ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023 ఆస్కార్ అవార్డుకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట నామినేట్ అయింది. అంతే కాకుండా ఈ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ వేదిక పై లైవ్లో ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం చూసి తెలుగు సినీ ప్రేమికులు గర్వంగా ఫీలవుతున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో పాటు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఈ గ్రాండ్ నైట్ కు హాజరు కానున్నారు.