Homeసినిమా వార్తలుRRR: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచిన ఆర్ ఆర్ ఆర్

RRR: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచిన ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్, జపాన్‌లో JPY 1 బిలియన్ (62 కోట్లు) సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన 122వ రోజు ఈ అసాధారణ బెంచ్‌మార్క్‌ని దాటింది. ఇది ఏ విధంగా చూసినా అద్భుతమైన విజయం అనే చెప్పాలి. గత రెండు దశాబ్దాలకు పైగా జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా JPY 400 మిలియన్లతో రజినీకాంత్ సినిమా ముత్తు ఉండింది.

గత సంవత్సరం అక్టోబర్‌లో జపాన్ లో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ కొన్ని అప్పటి నుంచి తన బాక్సాఫీస్ ప్రదర్శనను నిలకడగా నిలబెట్టింది మరియు ఇటీవల, ఆస్కార్ అవార్డుల సీజన్‌ తీసుకువచ్చిన సందడితో ఈ సినిమా కలెక్షన్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గత నాలుగు వారాలుగా ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో సాధించిన కలెక్షన్లు ఈ సినిమా ప్రారంభ వారం కలెక్షన్ల కన్నా ఎక్కువ ఉండటమే.

జపాన్‌లో విడుదలై 100 రోజులు దాటినా కూడా ఇంకా ఈ సినిమా జోరు తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జపనీస్ మార్కెట్‌లో, సాధారణంగా సినిమాలు కేవలం కొద్ది రోజులు ఆడకుండా లాంగ్ రన్ ఉండటం ఆనవాయితీ.

READ  Thalapathy67: విజయ్- లోకేష్ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్

ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ మరియు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో అందుకుంది. ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్స్ మరియు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో గెలుచుకుంది. ఈ చిత్రం క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ని కూడా కైవసం చేసుకుంది. ఆ తర్వాత బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు కూడా ఎంపికైన సంగతి తెలిసిందే.

నిజానికి ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విడుదలైనప్పుడు ఈ చిత్రం జపనీస్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా స్కోర్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు మరియు జపాన్‌లో విడుదల చేయడం సమయం వృధా అని కూడా కొందరు వ్యాఖ్యానించారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలను మించిపోయింది మరియు జపాన్ రన్ లో 18వ వారంలో 635K ఫుట్‌ఫాల్స్‌తో జపాన్ బాక్స్-ఆఫీస్ వద్ద భారీ సంఖ్యలో 1 బిలియన్ వసూలు చేసింది. మరి ఈ అద్భుతమైన ఫీట్ తర్వాత ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాలి

READ  Samantha: శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో ఎమోషనల్ అయిన సమంత

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories