టాలీవుడ్ యాక్టర్ నితిన్ హీరోగా అందాల కథనాయక శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శికుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబిన్ హుడ్. ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ముఖ్యంగా మొదటి నుంచి సినిమా యొక్క కంటెంట్ బాగుంటుందని ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా చేస్తూ వచ్చింది టీం. అయితే ఓవరాల్ గా రిలీజ్ అనంతరం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలబడి పలు ఏరియాల బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలు మిగిల్చింది.
నితిన్ శ్రీలీల ఇద్దరి యాక్టింగ్ బాగున్నప్పటికీ కూడా సినిమాలోని కథనాలు చాలావరకు లోపంతో సాగడం, సెకండ్ హాఫ్ మరింతగా నీరసంగా ఉండటంతో సినిమాకి ఆడియన్స్ ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు.
అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5 ద్వారా మే 2 న పలు భాషల ఓటిటి ఆడియన్స్ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. మరి థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రాబిన్ హుడ్ ఎంతమేర ఓటీటీలో మెప్పిస్తుందో ఏస్థాయి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.