నితిన్ హీరోగా యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇటీవల రాబిన్ హుడ్ నుండి రిలీజ్ అయిన వన్ మోర్ టైం అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మూవీ నుండి సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియోని ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ‘వేర్ ఎవర్ యు గో’ అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
అర్మాన్ మాలిక్ పాడిన ఈ సాంగ్ ని కేకే రచించగా దీని ప్రేమోని రేపు ఉదయం 11 గం. 7 ని. లకు రిలీజ్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాబిన్ హుడ్ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ ఆకట్టుకోవడంతో మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.