Home సినిమా వార్తలు ఓవర్సీస్ వద్ద నాన్ కేజీఎఫ్ రికార్డు వైపు దూసుకుపోతున్న కాంతార

ఓవర్సీస్ వద్ద నాన్ కేజీఎఫ్ రికార్డు వైపు దూసుకుపోతున్న కాంతార

Rishab Shetty's Kantara Is On Track To Achieve Non-KGF Record At The Box Office

ప్రతి సంవత్సరం, కొన్ని సినిమాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఆ సినిమాలు కార్తికేయ 2 మరియు కాంతార రూపంలో వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా చిన్న సినిమాలుగా చాలా తక్కువ షోలతో విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఒక విధ్వంసాన్ని సృష్టించే స్థాయిలో కలెక్షన్లు నమోదు చేశాయి.

విడుదలైనప్పటి నుంచి కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. కాగా రేపటితో ఈ చిత్రం ఓవర్సీస్ వద్ద 1 మిలియన్ డాలర్ మార్క్ ని దాటి చేయనుంది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రబలుతున్న టాక్ వల్ల ఈ చిత్రానికి స్క్రీన్‌లు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి.

ఇంతవరకూ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి యష్ నటించిన KGF మాత్రమే 1 మిలియన్ మార్కును సాధించగలిగింది. కాంతార ఆ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కన్నడ వెర్షన్ ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుండడంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లలో విడుదల చేయాలనే హైప్ బాగా క్రియేట్ చేశాయి.

కాగా కాంతార హిందీ వెర్షన్ నిన్న విడుదలై అద్భుతమైన వసూళ్లను సాధించింది. విశేషం ఏమిటంటే ఈ సినిమా చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్ర చేసిన గాడ్‌ఫాదర్‌ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదల అవబోతుంది. కాగా తెలుగు వెర్షన్ తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఇప్పటికే ‘బెల్ బాటమ్’ ‘హీరో’ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో రిషబ్ శెట్టి.. కన్నడ సినీ పరిశ్రమను పైకి తీసుకు వెళ్ళే వరుసలో అద్భుతమైన సినిమాలను అందిస్తూ వస్తున్నారు. ‘గరుడ గమన వృషభ వాహన’ సినిమాతో ఇది వరకే సంచలనం సృష్టించిన రిషబ్.. ఇప్పుడు ”కాంతార” చిత్రంతో కన్నడ సీమలోనే కాక యావత్ భారత సినీ పరిశ్రమలో ప్రభంజనం సృష్టిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version