Home సినిమా వార్తలు RGV Reveals Allu Arjun Remuneration అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రివీల్ చేసిన ఆర్జీవీ

RGV Reveals Allu Arjun Remuneration అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రివీల్ చేసిన ఆర్జీవీ

ram gopal varma

తాజాగా ఒక్కో సినిమాతో నటుడిగా ఎంతో మంచి క్రేజ్ ని భారీ స్థాయి మార్కెట్ ని కూడా పెంచుకుంటూ కొనసాగుతున్నారు అల్లు అర్జున్. 2020లో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో కెరియర్ పరంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 1 తో పాన్ ఇండియన్ హీరోగా మరింత మంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 మూవీతో ఆయన మార్కెట్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ మూవీ కనుక సక్సెస్ అయితే అల్లు అర్జున్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోగా నిలుస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. నేడు రిలీజ్ అయిన ఈ మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మ్యాటర్ ఏమిటంటే, తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు.

మెగా హీరోస్ ని ఒకింత ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ అల్లు అర్జున్ ఓవరాల్ రెమ్యూనరేషన్ రూ. 287 కోట్ల 30 లక్షలు అంటూ మెగా హీరోలపై సెటైర్ వేశారు వర్మ. అయితే వర్మ చేసిన ఈ కామెంట్స్ పై నటిజన్స్ పలురకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా మెగా హీరోస్ పై సెటైర్స్ వేస్తూ అల్లు అర్జున్ పై వర్మ ప్రశంసలు కురిపించిన ఘటనల గురించి తెల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version