స్టార్ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రెట్రో. ఈ మూవీలో జాజు జార్జి, జయరాం, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేసారు.
2డి ఎంటర్టైన్మెంట్స్,స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థల పై కార్తికేయన్ సంతానం, రాజేష్ పాండియన్ లతో కలిసి సూర్య, జ్యోతిక గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే టాక్ ని అందుకుంది. ఈ మూవీలో పారివేల్ కణ్ణన్ పాత్రలో మరొక్కసారి తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించారు సూర్య.
ఇక ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కాబడి రిలీజ్ అయింది. అయితే తమిళ్ తో పాటు తెలుగులో కూడా రెట్రో మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ రూ. 72 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, తమిళనాడులో రూ. 36 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్లు, అలానే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని ఈ మొత్తాన్ని రాబట్టింది.
ప్రస్తుతం ఈ మూవీ యొక్క కలెక్షన్ పరిస్థితిని బట్టి చూస్తే ఓవరాల్ గా రూ. 100 కోట్ల మార్క్ వరకు మాత్రమే చేరుకునే అవకాశం కనపడుతోంది. అయితే కంగువ డిజాస్టర్ అనంతరం రెట్రో బాగా ఆడుతుందని భావించిన సూర్య ఫ్యాన్స్ ని ఈ మూవీ కేవలం పర్వాలేదనిపించేలా అలరించింది అంతే.