కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా అందాల నటి పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ లవ్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ రెట్రో. జాజు జార్జి, జయరాం, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్, సుజిత్ శంకర్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.
మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కార్తేకేయన్ సంతానం, కళ్యాణ్ సుబ్రమణియన్, జ్యోతిక, సూర్య కల్సి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ మే 1 న ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ నుండి కన్నడి పూవే అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని ఫిబ్రవరి 13న రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు.
లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈమూవీ మరి రిలీజ్ అనంతరం ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి మరొక రెండున్నర నెలలు వెయిట్ చేయాల్సిందే.