పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ ఓజి ఒకటి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటివరకు ఆల్మోస్ట్ 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఓజీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందర్నీ ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీలో పవన్ యంగ్ గా కనిపించే పాత్రలో ఆయన కుమారుడు అకీరానందన్ కనిపించరున్నారని కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వాటిపై స్పందించిన రేడు దేశాయ్, అందులో ఏమాత్రం నిజం లేదని ఖండించారు. ప్రస్తుతానికైతే అకీరాకి సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని ఒకవేళ తాను నటించాలనుకుంటే తనకి అభ్యంతరం లేదని అన్నారు. ఒకవేళ అది ఫిక్స్ అయితే తాను ఆ విషయాన్ని అధికారికంగాఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్తారని ఆమె అన్నారు. దానితో ఓజిలో అఖీరా లేడని తేటతెల్లమైంది.