Homeసినిమా వార్తలువైవిధ్యమైన నటిగా ఎదుగుతున్న రెజీనా కసాండ్రా

వైవిధ్యమైన నటిగా ఎదుగుతున్న రెజీనా కసాండ్రా

- Advertisement -

రెజీనా కసాండ్రా.. 15 ఏళ్ళ కెరీర్ ప్రయాణంలో నటిగా ఆమె ప్రస్థానం ప్రశంసనీయం. సాధారణం రొమాంటిక్ సినిమాలలో హీరోయిన్ గా మొదట్లోముద్ర పడినా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన నటనను కెరీర్ ను మెరుగు పరుచుకున్నారు అనే చెప్పాలి.

రెజీనా,అడివి శేష్ కలిసి నటించగా 2019లో విడుదలైన “ఎవరు” సినిమాలో తన నటనకు అటు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా, sonyliv లో విడుదల అయిన “రాకెట్ బాయ్స్” వెబ్ సీరీస్ లో మృణాళిని సారాభాయ్ పాత్రలో అద్భుతంగా నటించి ఔరా అనిపించింది. ఆ పాత్రను ఆమె సమర్థవంతంగా పోషించి ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోగలను అని నిరూపించుకుంది.వైవిద్యమైన పాత్రలకు, నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రెజీనా.

ఈ క్రమంలోనే మరో వైవిద్యమైన పాత్రలో రెజీనా కనిపించబోతున్నారు.ఓటీటీ వేదిక ‘ఆహా’ హారర్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే వెబ్‌ సిరీస్‌ను అర్కా మీడియాతో కలిసి ఆహా రూపొందించింది. ఈ వెబ్‌ సిరీస్ జూలై 1వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

READ  అంతర్జాతీయ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆర్ ఆర్ ఆర్

ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌‌ను ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి లాంచ్ చేశారు. రెజీనా కసాండ్రా , నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు.దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌లోకి దెయ్యం వస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ఊహించని మలుపులతో హారర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్ 7 ఎపిసోడ్‌లలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  సాయి పల్లవి క్రేజ్ కేవలం ఫంక్షన్ ల వరకేనా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories