కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటెర్టైనెర్ మూవీ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ మూవీని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈమూవీని సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. మరోవైపు రిలీజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకోవడంతో అతి త్వరలో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. విషయం ఏమిటంటే, ఈ మూవీని తమిళనాడులో రిలీజ్ రోజున మొత్తంగా అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకరకంగా ఇది అక్కడ ఆల్ టైం రికార్డు అని చెప్పాలి. ఇక మేకర్స్ తో పాటు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ మూవీ పై మంచి నమ్మకంతో ఉన్నారని టాక్. అయితే మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ తరువాత పక్కాగా ఏ రేంజ్ హైప్ ఉందనేది తెలుస్తుందని, ట్రైలర్ కట్ కనుక బాగుంటే ఓపెనింగ్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రావడం ఖాయం అంటున్నారు అక్కడి ట్రేడ్ అనలిస్టులు. యువ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.