నిన్న రాత్రి హైదరాబాద్ లో విరాట పర్వం ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులు గా విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వస్తారు అని సినిమా టీమ్ ప్రకటించారు.
వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ‘విరాట పర్వం’ సినిమాను 1990 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించటం జరిగింది. కాగా ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి సందడి నటించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చక్కని స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యం లోనే బుధవారం ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
అయితే ముందుగా చెప్పుకున్నట్టు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు అని తెలిసి మెగా అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ఫంక్షన్ మొదలు అయ్యాక మిగతా అతిథులు మాట్లాడటం మొదలైనా ఇంకా రామ్ చరణ్ రాలేదు, చివరికి హీరో హీరోయిన్ ల స్పీచ్ సమయానికి కూడా అభిమానుల ఎదురు చూపులు ఫలించలేదు.
ఇక రానా స్పీచ్ సమయంలో అసలు సంగతి బయట పడింది. ఫ్లైట్ లేట్ అవటం వలన రామ్ చరణ్ ఈవెంట్ కి రాలేక పోయారు అని, ఆయన తరపున రానా చరణ్ అభిమానులకి క్షమాపణ చెప్పారు. అయితే ఇదే ఈవెంట్ కి రావాల్సిన మరో అతిధి సుకుమార్ ఎందుకు రాలేదో ఎలాంటి వివరాలు తెలియలేదు.