ఇటీవల గేమ్ చేంజర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రిలీజ్ అనంతరం గేమ్ ఛేంజర్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నారు రామ్ చరణ్.
ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతుంది. విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు బుచ్చిబాబు సన.
తన ఫస్ట్ మూవీ ఉప్పెన సమయంలో థియేటర్ వద్ద ప్రతి ఒక్కరినీ సినిమా ఎలా ఉందని తన తండ్రి అడిగి తెలుసుకునే వారని, అయితే ప్రస్తుతం రాంచరణ్ తో చేస్తున్న సినిమా విషయమై ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అది బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ ఒక మీడియా ఈవెంట్లో భాగంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బుచ్చిబాబు సన.
రామ్ చరణ్ కెరీర్ 16వ మూవీగా రూపొందుతున్న ఈ ప్రాజక్ట్ పై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ అఫీషియల్ గా రానుంది.