మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఇటీవల దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో రిలీజ్ అయింది.
అయితే ఈ మూవీ అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీని అనంతరం ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నారు రాంచరణ్. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై వెంకట సతీష్ కిలారు దీనిని ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ న్యూస్ ని బట్టి ఈ మూవీ పవర్ క్రికెట్ నేపథ్యంలో సాగుతుందట.
అలానే ఆకట్టుకునే కథనాలతో దర్శకుడు బుచ్చిబాబు దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్ నీ విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. అలానే ఈ మూవీకి కుస్తీ క్రికెట్ అలానే పవర్ క్రికెట్ అనే పేర్లు కలిసి వచ్చేలా ఫైనల్ గా ఒక టైటిల్ ని త్వరలో ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. దానితో పాటు మూవీ యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉందట టీమ్