Homeసినిమా వార్తలుRavanasura: మాస్ పోస్టర్‌తో విడుదలైన రవితేజ రావణాసుర టీజర్ డేట్

Ravanasura: మాస్ పోస్టర్‌తో విడుదలైన రవితేజ రావణాసుర టీజర్ డేట్

- Advertisement -

ప్రస్తుతం కెరీర్‌లో అద్భుతమైన దశలో ఉన్న మాస్ మహారాజా రవితేజ, త్వరలోనే రావణాసుర అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి రారా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు. ఈరోజు రవితేజ అభిమానులకు, సినీ ప్రేమికులకు ఈ చిత్ర నిర్మాతలు శుభవార్త వెల్లడించారు.

రావణాసుర టీమ్ తాజా అప్‌డేట్ ఏమిటంటే, మార్చి 6న ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా యొక్క టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు రవితేజ ఉన్న ఒక ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. రవితేజ ట్రెండీ వేషధారణతో పాటు మాస్ లుక్‌ ను మనం పోస్టర్‌లో చూడచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ మధ్యకాలంలో విడుదలైన రావణాసుర థీమ్ సాంగ్ ప్రేక్షకుల నుండి సంచలనాత్మక స్పందనను పొందింది మరియు ప్రాజెక్ట్ కోసం భారీ బజ్ సృష్టించింది. కూల్ బీట్‌లతో కూడిన ఈ ఫుట్-ట్యాపింగ్ పాట అందరి నుండి పెద్ద మన్ననలు పొందింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌ సంగీతం అందించగా.. హారిక నారాయణ్ పాడిన ఈ పాట అందరినీ అలరించింది. ప్రత్యేకమైన పోస్టర్లు మరియు ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే సినీ ప్రేమికులలో సాలిడ్ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది, మరి టీజర్‌లో ప్రేక్షకుల కోసం టీమ్ ఇంకెన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంచిందో వేచి చూడాలి.

READ  Kiara Advani: బాలీవుడ్ హీరోతో కియారా అద్వానీ పెళ్లి డేట్ ఫిక్స్

రావణాసురలో సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా మరియు పూజిత పొన్నాడ కూడా నటించారు. ఈ ప్రాజెక్ట్‌కి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, రవితేజ యొక్క RT టీమ్ వర్క్స్ మరియు అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Google Trends 2022: మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ యాక్టర్ (మేల్) గా మరోసారి టాప్ లో నిలిచిన అల్లు అర్జున్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories