రవితేజ యొక్క రావణాసుర ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. స్టైలిష్ ట్రైలర్ మరియు మాస్ మహారాజా యొక్క ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ కారణంగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో గొప్ప ఆసక్తి నెలకొంది. తన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేకు పేరుగాంచిన సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రవితేజ గ్రే షేడ్‌లో కనిపిస్తారని ఇప్పటికే చిత్ర బృందం తెలియజేశారు. మరి ఈరోజు ఎర్లీ షోలలో సినిమాను చూసిన వారు ఏమంటున్నారో సినిమాకి టాక్ ఎలా ఉందో చూద్దాం.
రావణాసుర సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉందని, అయితే మొదటి సగంలో చాలా నెమ్మదిగా ప్రారంభమైన సినిమా 30 నిమిషాల తర్వాత ఊపందుకుందని అంటున్నారు. లవ్ ట్రాక్ చాలా బోరింగ్ గా ఉండి మరియు సహనాన్ని పరీక్షిస్తే.. సుశాంత్ మరియు రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయట.
ఓవరాల్‌గా సినిమా సగటు ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని మంచి సీన్స్‌తో పాటు కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి అని టాక్ వచ్చింది. మొత్తంమీద ఓవర్సీస్ మరియు ఎర్లీ షోల నుండి రావణాసుర సినిమాకి వచ్చిన టాక్ మరియు రిపోర్ట్ చూసుకుంటే బిలో యావరేజ్ నుండి యావరేజ్‌గా ఉంది. రవితేజ నెగిటివ్ క్యారెక్టరైజేషన్, ట్విస్ట్‌లు మరియు ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకి పాజిటివ్ పాయింట్స్ అయితే స్లో స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు రొమాంటిక్ ట్రాక్ నెగిటివ్ పాయింట్స్ గా చెప్తున్నారు.
తొలి రోజు మిక్స్‌డ్ రిపోర్ట్స్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. రవితేజ తన మాస్ ఇమేజ్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలరు. అయితే వారు ఆయన నుండి కమర్షియల్ ఎంటర్టైనర్ ఆశిస్తారు, కానీ రావణాసుర ఒక క్రైమ్ థ్రిల్లర్ మరియు ఇందులో రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవు.
రావణాసురలో ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ మరియు సుశాంత్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు.