Homeసినిమా వార్తలుOTTలో విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ

OTTలో విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించి ఇటీవలే విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. కాగా విడుదలైన మొదటి రోజునే.. ఈ చిత్రం పేలవమైన కంటెంట్‌ వల్ల అటు విమర్శకులు మరియు ప్రేక్షకులచే తిరస్కరించబడింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. కేవలం తొలి రోజు మాత్రమే కాస్త గౌరవప్రదమైన నంబర్లను రాబట్టగలిగింది.

నిజానికి కథలో మంచి విషయం ఉన్నా.. తెరకెక్కించే విధానం నిస్సారంగా ఉండటంతో ప్రేక్షకులకి ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. కలెక్టర్ పాత్రలో కొత్త లుక్ తో పాటు తన కెరీర్ లోనే ఎప్పుడూ లేని విధంగా సీరియస్ రోల్ లో రవితేజ నటించారు. అయితే మాస్ రాజాను చూస్తే ఎనర్జీ నిండిన పాత్రలో లేదా ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో చూస్తాం కానీ ఇలా నీరసంగా ఉన్న పాత్రలో చూడలేము అని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలి అన్న రవితేజ కోరిక అలా నెరవేరకుండా పోయింది.

అయితే ప్రస్తుతం అన్ని సినిమాలకు జరిగినట్లే, ఈ సినిమాకు కూడా OTT రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. వారి ఎదురుచూపులు ఫలించి సెప్టెంబర్ 15న సోనీలివ్ ప్లాట్‌ఫారంలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.

READ  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సీతారామం

ఈ మేరకు సదరు OTT ప్లాట్‌ఫారం కొద్దిసేపటి క్రితం ఇదే విషయానికి సంభందించి అధికారిక ధృవీకరణ ఇచ్చింది. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుందని సమాచారం.

ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. ఒకప్పుడు పాపులర్ హీరో అయిన నటుడు వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో తిరిగి వెండితెర పై కనిపించారు. SLV సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించగా, నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు.

సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, సర్పత్తా జాన్ విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని వారు సెప్టెంబర్ 15 నుండి సోనీలివ్‌లో చూసి ఆనందించవచ్చు.

Follow on Google News Follow on Whatsapp

READ  వైజాగ్ లోని సొంత థియేటర్ అమ్మేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories