మాస్ మహారాజా రవితేజ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ మిస్టర్ బచ్చన్. ఇటీవల బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన ది రెయిడ్ మూవీకి అఫీషియల్ గా రూపొందుతోంది మిస్టర్ బచ్చన్.
ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, సితార్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.
అయితే విషయం ఏమిటంటే, తాజాగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడలి.