టాలీవుడ్ నటుల్లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ కెరీర్ పరంగా ప్రస్తుతం ఒకింత ఇబ్బందికర ఫేజ్ లో కొనసాగుతున్నారని చెప్పాలి. తాజాగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ మిస్టర్ బచ్చన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు రవితేజ. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీనిని నిర్మించింది.
అయితే ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది మిస్టర్ బచ్చన్. ఇక మరోవైపు ఇటీవల ధమాకా సక్సెస్ తరువాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ వరుసగా పరాజయం పాలయ్యాయి. కాగా వరుసగా రవితేజ సినిమాలకు భారీగా నిర్మాతలు బడ్జెట్స్ కేటాయించడం, రిలీజ్ అనంతరం అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం జరుగుతూ వస్తోంది.
ఆ విధంగా హై బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న మాస్ మహారాజా, లోరిటర్న్స్ అందిస్తూ అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందిగా మారారు. నిజానికి గతంలో మంచి మూవీస్ ఎంపిక చేసుకునే రవితేజ ఇటీవల పేలవమైన కథల ఎంపికతో ఈ విధంగా పరాజయాలు అందుకుంటున్నారని, అందుకే ఇకపైన అయినా కథల ఎంపికలో ఆయన జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ తో పాటు పలువురు ఆడియన్స్ కూడా కోరుతున్నారు.