మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇటీవల మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై రూపొందిన ఈ సినిమా ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ బాగున్నప్పటికీ కూడా హరీష్ శంకర్ టేకింగ్ పై విమర్శలు వచ్చాయి. ఇక దీని అనంతరం ప్రస్తుతం యువ దర్శకుడు భాను భోగవరపుతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు రవితేజ.
ఇటీవల సామజవరగమనా వంటి ఫ్యామిలీ యాక్షన్ మూవీకి కథని అందించిన భాను ఈ సినిమా ద్వారా మెగా ఫోన్ పడుతున్నారు. ఇక ఈ సినిమా ఇటీవల షూటింగ్ ప్రారంభించుకోగా ఇందులో రవితేజ మంచి ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. రేపు దీపావళి పండుగ సందర్భంగా నేడు ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మాస్ జాతర అనే టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది, మనదే ఇదంతా అనేది ఉప శీర్షిక.
ముఖ్యంగా ఈ సినిమా యొక్క ఫస్ట్ పోస్టర్లో రవితేజ అదిరిపోయే మాస్ పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. మాస్ యాక్షన్ మూవీగా రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవటం ఖాయమని అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి 2025 సమ్మర్ కానుకగా మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, అలానే శ్రీకర స్టూడియో సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు.