ధమాకా వంటి భారీ విజయంతో 2022 సంవత్సరానికి అద్భుతమైన ముగింపు పలికిన రవితేజ 2023 లో బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యతో అదే జోరును కొనసాగించారు. వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ అప్పీల్ తో ప్రేక్షకులను అలరించగా, మాస్ మహారాజా మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ఫుల్ రోల్ కూడా ఈ సినిమా విజయంలో పెద్ద పాత్ర పోషించాయి అని చెప్పాలి.
ఇప్పుడు అందరి చూపు ఆయన తదుపరి చిత్రం రావణాసుర పైనే ఉంది. కాగా ఇటీవలే విడుదలైన రావణాసుర థీమ్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. కూల్ బీట్స్ తో కూడిన ఈ ఫుట్ ట్యాపింగ్ సాంగ్ కు అందరి నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇక ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కని బాణీలకు హారిక నారాయణ్ పాడిన విధానం కూడా అందరినీ కట్టిపడేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన యూనిక్ పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ లవర్స్ లో చాలా ఆసక్తిని పెంపొందించింది.
రావణాసుర చిత్రంలో రవితేజ తో పాటు సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ వంటి అందాల భామలు కూడా కనిపించనున్నారు. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్, అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.