మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ లు మాత్రం లభించడం లేదు. ఇక ఇటీవల మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన రీమేక్ మూవీ మిస్టర్ బచ్చన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు.
ఇక ప్రస్తుతం సామజగవరగమన కథకుడు భాను భోగవరపు దర్శకత్వంలో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు రవితేజ. దీనిని సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తుండగా యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటెర్టైన్మెంట్ అంశాలతో ఈ మూవీ గ్రాండ్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
భీమ్స్ సిసిలోరియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సందర్భంగా రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అనౌన్స్ చేసారు. మరి ఈమూవీ తో మాస్ మహారాజా రవితేజ ఎంత మేర విజయం అందుకుంటారో చూడాలి.