Homeసినిమా వార్తలుRaviteja: సహజమైన సెట్లతో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ

Raviteja: సహజమైన సెట్లతో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 29న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే వారం విడుదలకు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం చాలా బాగా నిర్వహించారు.

ఈ క్రమంలో విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ రెవిన్యూ అధికారిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రవితేజ నుండి ప్రేక్షకులు ఆశించే మాస్, యాక్షన్ అంశాలు ఉంటూనే థ్రిల్లర్ మరియు సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉండేలా అనిపిస్తుంది. తొలి సినిమా అయినప్పటికీ శరత్ మండవ చాలా సమర్థవంతంగా తెరకెక్కించారని సమాచారం.

హత్యలు, మిస్సింగ్ కేసుల నేపథ్యంలో నడిచే కథగా ఉన్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. తమిళ దర్శకుడు సామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ కెమెరా భాద్యతను చేపట్టారు. ఆర్ట్ వర్క్ విభాగాన్ని సాహి సురేష్ కు అప్పగించారు.

READ  ఆ విషయంలో పరశురాందే తప్పు అంటున్న మహేష్ ఫ్యాన్స్

అయితే ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు సాహి సురేష్ మీడియాతో చెప్పడం జరిగింది. ఈ సినిమా తొంభైల (1995) నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకోసం నిజంగా అప్పటి వాతావరణాన్ని సృష్టించడానికి చిత్ర యూనిట్ కష్టపడిందని ఆయన తెలిపారు. అప్పటి గ్రామం, వీధులు, ఎమ్మార్వో ఆఫీస్ ల సెట్స్ ను అద్భుతంగా వేశామని, అలాగే పాటల కోసం కూడా భారీ సెట్స్ వేశారని, అంతే కాకుండా ఎమ్మార్వో ఆఫీస్ సెట్ హీరో రవితేజకు చాలా బాగా నచ్చింది అని ఆయన చెప్పడం విశేషం.

Follow on Google News Follow on Whatsapp

READ  సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన నిర్మాతలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories