Homeసినిమా వార్తలురామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

- Advertisement -

మాస్ మహరాజ్ రవితేజ ఫిబ్రవరిలో “ఖిలాడీ” సినిమా తరువాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శరత్ మండవ దర్శకత్వంలో దివ్యాంష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ తెరకెక్కింది. జులై 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల టాక్ ఏలా ఉందో చూద్దాం.

కథ విషయానికి వస్తే.. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. రాయలసీమలో ఓ ప్రాంతానికి అధికారిగా వచ్చిన రామారావు, ఒకేసారి కనపడకుండా పోయిన ఇరవై మంది జాడ తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కనపడకుండా పోయిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ అదృశ్యం వెనుక ఎవరున్నారు? ఈ మొత్తం కేసుని రామారావు ఎలా ఛేదించాడు? అనేది కథ.

దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని యాక్షన్ మరియ క్రైమ్ థ్రిల్లర్ గా తెరక్కించినట్లు తెలుస్తుంది. సినిమాలో ఎక్కువ శాతం ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో నిండి ఉంది. తమ వారు కనిపించకుండా పోయిన కొందరు పేదలు రామారావుని ఆశ్రయించడం, వాళ్ళ ఆచూకీ కోసం రామారావు అన్వేషించడం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. హీరో రవితేజ రామారావుగా కొత్త తరహా ఆహార్యంతో, మేనరిజంతో ఆకట్టుకున్నారు అని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో పాటలు సినిమాకు మైనస్ అంటున్నారు. సీరియస్ గా సాగుతున్న సినిమాకి పాటలు అడ్డంకిగా మారాయి అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

READ  ఆంధ్రప్రదేశ్: థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకున్న ఎగ్జిబిటర్లు

హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్న దర్శకుడు, మిస్సింగ్ కేసుల పాయింట్ ని సరైన విధంగా ప్రభావం చూపేలా తెర కెక్కించలేదని అంటున్నారు. సామ్ సీఎస్ పాటలు సినిమాలో ఇమడక పోయినా నేపథ్య సంగీతం మాత్రం బాగా ఇచ్చారని తెలుస్తోంది.

ఇక సెకండ్ హాఫ్ లో పొలిటికల్ మాఫియాకి సంభందించిన సన్నివేశాలు కూడా అనుకున్నంత ఆసక్తికరంగా లేవని సమాచారం. ఎక్కడో మొదలైన కథ మంగళూరుకి.. మళ్ళీ అక్కడ నుండి ఇంకా ఎక్కడికో వెళ్లిపోయింది అని ప్రేక్షకులు పేర్కొన్నారు. అందువల్ల సెకండ్ హాఫ్ లో సైతం సినిమా పరుగులు పెట్టలేదని దానికి కారణం బలహీనమైన కథనం, అనాసక్తికరంగా సాగిన ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు అని అంటున్నారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి ఉండాల్సిన పకడ్బందీ కథనం రామారావు ఆన్ డ్యూటీలో కరువయ్యింది అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్ గా 18 కోట్ల కలెక్షన్లు సాధించాలి. ఓపెనింగ్ షో వరకూ అతి సాధారణ స్థాయిలో ఉన్న కలెక్షన్లు మరి ఇలాంటి మిక్స్డ్ టాక్ ను తట్టుకుని ఎలా గట్టెక్కుతుందా అనేది చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  రీమేకులు మేకులు అయ్యాయి -4 కోట్ల నష్టం వచ్చిందన్న దిల్ రాజు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories