Homeసినిమా వార్తలుRavanasura: షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ భారీ బడ్జెట్ సినిమా రావణాసుర

Ravanasura: షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ భారీ బడ్జెట్ సినిమా రావణాసుర

- Advertisement -

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రంతో మరో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయన ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు యాక్షన్ థ్రిల్లర్ రావణాసురలో కనిపించనున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో, భారీ సంఖ్యలో మహిళా కథానాయికలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో దర్శకుడు సుధీర్ వర్మ విజవంతం అయ్యారు. చివరిగా ఒక సాంగ్ షూట్‌తో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్లు మరియు ప్రమోషనల్ సాంగ్ సినిమాకు గొప్ప క్రేజ్ ను సృష్టించాయి మరియు సబ్జెక్ట్ పూర్తిగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. గ్రే క్యారెక్టర్‌లో రవితేజను చూసి ఆనందించడానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. రావణాసురలో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుండగా.. అందాల భామలు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్ మరియు పూజిత పొన్నాడ కూడా ఈ సినిమాలో కనిపిస్తారు.

READ  Raviteja: టాప్ ఫామ్ లో ఉన్న రవితేజ రావణసుర థీమ్ సాంగ్ తో మరోసారి సత్తా చాటారు

రవితేజ యొక్క RT టీమ్‌వర్క్స్ మరియు అభిషేక్ నామా రావణాసుర సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూరుస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories