మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ధమాకా ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ధమాకా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇప్పటివరకూ బాగా పనిచేసింది. చిత్ర బృందం విడుదల చేసిన పాటలు సూపర్బ్ గా ఉన్నాయి, ముఖ్యంగా మాస్ రాజా సాంగ్ వైరల్ అయ్యింది. పైన చెప్పినట్లుగానే మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను ఏర్పరచుకుంది.
మాస్ హీరోగా రవితేజ బ్రాండ్ తో పాటు యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాకు క్రేజ్ రావడానికి దోహదపడింది. దర్శకుడు త్రినాథరావుకు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ ఉంది మరియు అతని గత చిత్రాలు సూపర్ హిట్ అయిన మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.
ఈ అంశాలు అన్నీ కలిసి ధమాకా సినిమాకి ట్రేడ్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పాటు చేసి తద్వారా అద్భుతమైన బిజినెస్ చేయడానికి సహాయ పడ్డాయి.
ధమాకా థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ట్రేడ్ సర్కిల్స్ లో పాజిటివ్ బజ్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించారు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ధమాకా’ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో రవితేజ నిరాశపరిచారు. ఈ సినిమాతో ఆయన తిరిగి మంచి సూపర్ హిట్ ఇస్తారని ఆశిద్దాం.