చిత్రం: రావణాసుర
రేటింగ్: 2.5/5
నటీనటులు: రవితేజ, దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, సుశాంత్, మేఖా ఆకాష్
దర్శకుడు: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్
విడుదల తేదీ: 7 ఏప్రిల్ 2023
సుధీర్ వర్మ – రవితేజ కాంబప్ రావణాసుర సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి అభిమానులు మరియు ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి నెలకొంది . ఈ చిత్రంలో మాస్ మహారాజా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం చెప్పడం.. ఇక ఇతర ప్రచార కంటెంట్ కూడా సినిమా ప్రేమికులలో గొప్ప అంచనాలను సృష్టించింది. మరి రావణాసుర ఆ హైప్‌కు నిలబడిందా లేదా తెలుసుకుందాం.
కథ: హైదరాబాద్ లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి మరియు అవి ఏదో ఒక విధంగా క్రిమినల్ లాయర్ అయిన రవి (రవితేజ)తో ముడిపడి ఉంటాయి. అతను ఒక కేసు విషయంలో తన వద్దకు వచ్చిన హారిక (మేఘా ఆకాష్) తో ప్రేమలో పడతాడు. మరి హత్య కేసులలో ఉన్న ప్రత్యేకత ఏమిటి మరియు ఈ హత్యలకు రవికి ఉన్న సంబంధం ఏమిటి అనేది రావణాసుర సినిమాలో మిగతా కథ.
నటీనటులు: రవితేజ రావణాసుర సినిమా అంతటా తానే అయి నిలిచాడు మరియు సాధారణ సానుకూల స్వభావంతో పాటు ప్రతికూల ఛాయలున్న సన్నివేశల్లో సమానమైన నటనను కనబరిచి రెండు మూడ్‌ల మధ్య మార్పులను చాలా సులభంగా ప్రదర్శించారు. గ్రే షేడ్‌లో రవితేజ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. రవితేజ యొక్క సీనియర్ లాయర్ మరియు మాజీ లవర్ పాత్రలో ఫరియా అబ్దుల్లా ప్రాముఖ్యత ఉన్న పాత్రను బాగా పోషించారు మరియు ఆమెతో సమానంగా మంచి స్క్రీన్ టైమ్ ఉన్న మేఘా ఆకాష్ కూడా బాగా చేశారు. ఈ చిత్రంలో సుశాంత్ ది నిజానికి ముఖ్యమైన పాత్రే అయినప్పటికీ నటనలో పెద్దగా అద్భుతాలేమి ప్రదర్శించలేదు. ఇక ఇతర నటీనటులైన దక్షా నగార్కర్, అను ఇమ్మాన్యుయేల్ మరియు పూజిత పొన్నాడ యొక్క పాత్రలు ఎదో ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే.
విశ్లేషణ: రావణాసుర సినిమా యొక్క ప్రాథమిక కథాంశం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అయినప్పటికీ, చిత్రం యొక్క ప్రారంభ సన్నివేశాల్లో వేగం చాలా మందకొడిగా ఉంది మరియు 30 నిమిషాల తర్వాత గానీ వేగం పుంజుకోదు. లవ్ ట్రాక్ చాలా పేలవంగా ఉంటుంది. దాని వల్ల సినిమా యొక్క సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్‌ను తగ్గిస్తుంది. ఇలా సినిమా చాలా నెమ్మదిగా మొదలైనప్పటికీ, ఆసక్తికరమైన సన్నివేశాలు మరియు చక్కని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ వైపు పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ చివరి వరకూ ఆ ప్రభావం ఉండకుండా ఉన్న కథనంతో సినిమా ముగుస్తుంది.
ప్లస్ పాయింట్లు:
- రవితేజ నెగెటివ్ క్యారెక్టరైజేషన్
- ఇంటర్వెల్ బ్యాంగ్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్లు:
- స్లో నేరేషన్
- డల్ స్క్రీన్ ప్లే
- అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలు చాలా ఉండటం
తీర్పు:రావణాసుర నిజానికి కథగా చాలా అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న చిత్రం. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం నిరాశపరిచింది. ఈ చిత్రం రవితేజ నటనా నైపుణ్యాన్ని అభిమానులకు మరో అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది. మొత్తంగా, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ నచ్చే ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక సాధారణ ప్రేక్షకులను కూడా కొన్ని అలరించే క్షణాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ సినిమా వారిని అంతటా ఖచ్చితంగా కట్టిపడేయదు ఎందుకంటే థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రంతో ఇదే అతిపెద్ద సమస్య.