Home సినిమా వార్తలు Rashmika Mandanna to Act with Ram Charan రామ్ చరణ్ కి జోడీగా రష్మిక...

Rashmika Mandanna to Act with Ram Charan రామ్ చరణ్ కి జోడీగా రష్మిక మందన్న ?

ram charan

ఇటీవల దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు రాంచరణ్. బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్ లో నిర్మించగా ఎస్ తమన్ సంగీతం అందించారు. 

అయితే అంచనాలు ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది గేమ్ చేంజర్. ఇక తాజాగా ఉప్పెన దర్శికుడు బుచ్చిబాబు సన తో ఒక స్పోర్ట్స్ యాక్షన్ మాస్ డ్రామా మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. ఈ మూవీ అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఆయన తన తదుపరి RC 17 మూవీని చేయనున్నారు. 

ఇప్పటికే గతంలో రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దానితో ఈ తాజా క్రేజీ ప్రాజక్ట్ పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. 

విషయం ఏమిటంటే అత్యున్నత సాంకేతిక విలువలతో గ్రాండ్ లెవెల్ లో భారీ వ్యయంతో రూపొందనున్న ఈ మూవీలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మి రష్మిక మందన్న నటించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. త్వరలో ఆమెకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఆ మూవీ టీం నుంచి రానుందట. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version