Homeసినిమా వార్తలుకొత్త లుక్ లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన రష్మిక

కొత్త లుక్ లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన రష్మిక

- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు రోజు రోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. పాత్రల ఎంపికలో ఆమె చూపించే ప్రత్యేకత వల్లే ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్లడం సాధ్య పడుతుంది.

ఇది వరకే అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటించి మెప్పించడమే కాకుండా ఆ పైన బాలీవుడ్ లో సిద్ధార్థ మల్హోత్రా సరసన యాక్షన్ క్వీన్ పాత్రతో అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ కు కూతురు గానూ నటిస్తున్నారు. ఇంతలోనే రష్మిక మరో వైవిధ్యమైన పాత్రలో, కొత్త గెటప్ లో కనిపించి ప్రేక్షకులకు తీయని షాక్ ఇచ్చారు.

దుల్కర్ సల్మాన్ -మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న “సీతారామం” లో రష్మిక మందన్న ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రాముడి గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ కనిపించనుండగా.. హనుమంతుని పాత్రలో రష్మిక నటించడం విశేషం.ఈ మేరకు నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన తాజా ఫోటోలో ఒక ముస్లిమ్ యువతిగా హిజాబ్ ధరించి కనిపించారు. ఈ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

READ  మెగాస్టార్ కోసం దిల్ రాజు గాలం

ఈ ఏడాది ఏప్రిల్ 10న శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన సీతారామం లుక్ లోనే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ ప్రకటించారు.ఇప్పుడు ఈద్ ఉల్-అధా పేరుతో ఒక ప్రత్యేక పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేయగా , ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రష్మికది ఇందులో చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. ఆమె కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, ఆ పాత్రకు సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది.

సీతారామం సినిమాని స్వప్న సినిమాస్ పతాకం పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరు గాంచిన వైజయంతీ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని సమర్పిస్తోంది. దీనికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు- తమిళం- మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  అంతర్జాతీయ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆర్ ఆర్ ఆర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories